ETV Bharat / state

BJP Protests at Collectorates in Telangana : 'డబుల్​' ఆందోళనలు ఉద్ధృతం చేసిన బీజేపీ.. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 25, 2023, 8:18 PM IST

BJP Protests at Collectorates in Telangana : అధికార పార్టీ.. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కలెక్టరేట్ల వద్ద ముట్టడికి పిలుపునిచ్చారు. అర్హులైన వారికి వెంటనే డబుల్​ బెడ్​రూం ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్​ చేశారు.

Telangana BJP
BJP Leaders Siege Collectorates In Across Telangana
BJP Protests at Collectorates in Telangana డబుల్​ ఆందోళనలు ఉద్ధృతం చేసిన బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి

BJP Protests at Collectorates in Telangana : అధికార పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ.. బీజేపీ(BJP) ఆందోళనలు ఉద్ధృతం చేసింది. హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందంటూ.. ఇటీవలే బీఆర్​ఎస్(BRS)​ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, నివాసాలను పార్టీ శ్రేణులు ముట్టడించారు. తాజాగా.. ఇవాళ అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముట్టడికి యత్నించారు. అర్హులకు వెంటనే రెండు పడక గదుల ఇళ్లు(Double Bed Room Houses Scheme) కేటాయించాలంటూ డిమాండ్‌ చేశారు. పలుచోట్ల ధర్నాలకు దిగారు.

బీఆర్​ఎస్​ వైఫల్యాలను ఎండగడుతూ.. బీజేపీ నిరసనలను తీవ్రతరం చేస్తోంది. ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదంటూ.. ఆ పార్టీ రాష్ట్ర అధిష్ఠానం కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద బీజేపీ శ్రేణులు ఆందోళనలు చేశారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో.. హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ముందు ధర్నా నిర్వహించారు. అర్హులందరికీ సెప్టెంబరు 7లోపు ఇళ్లు కేటాయించకపోతే.. మిలియన్‌ మార్చ్‌(Million March) తరహాలో హైదరాబాద్‌ను దిగ్భందిస్తామని లక్ష్మణ్‌ హెచ్చరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని బీజేపీ కార్యాలయం వద్ద విడిచిపెట్టారు. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యమంటూ.. మేడ్చల్‌ జిల్లా కుషాయిగూడలో మాజీ ఎమ్మెల్యే ఎన్​వీఎస్​ఎస్​ ప్రభాకర్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

BJP Protest MLA Camp Offices in Telangana : ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నెరవేర్చలేదంటూ.. రాష్ట్రవ్యాప్తంగా బీజేేపీ ఆందోళనలు

BJP Leaders Siege Collectorates : హనుమకొండ, జనగామ కలెక్టరేట్ల వద్ద బీజేపీ కార్యకర్తలు ముట్టడికి యత్నించారు. ఆందోళనకారుల్ని అడ్డుకునేందుకు పోలీసులు ముళ్లకంచె ఏర్పాటు చేశారు. కొందరు కార్యకర్తలు గోడదూకి కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నించగా.. పోలీసులు వారిని జనగామ స్టేషన్‌కు తరలించారు. ములుగు కలెక్టరేట్‌ లోపలికి వెళ్లేందుకు బీజేపీ నేతలు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులకు, పార్టీ శ్రేణులకు మధ్య తోపులాట జరగడంతో.. పలువురు బీజేపీ కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి.

Bandi Sanjay on BRS MLA Tickets : '115 మందిలో సగం మందికి కేసీఆర్ బి ఫామ్‌ ఇవ్వరు'

BJP Dharna To Give Double Bedroom Houses : బీఆర్​ఎస్​ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందంటూ.. మాజీ మంత్రి బాబుమోహన్‌ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్‌ ముందు ధర్నా నిర్వహించారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందేవరకు పోరాటం ఆగదంటూ.. సిద్దిపేట, మెదక్‌ జిల్లాల కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు చేపట్టారు. ఆదిలాబాద్‌, కరీంనగర్‌ కలెక్టరేట్ల ముట్టడికి బీజేపీ నేతలు యత్నించగా.. అప్పటికే అప్రమత్తమైన పోలీసులు పలు రహదారులను మూసివేసి.. పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. రెండు రోజుల క్రితం బిచ్కుంద ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే ఇంటిని ముట్టడించేందుకు యత్నించిన క్రమంలో.. బీఆర్​ఎస్​ నాయకులు తమపై దాడి చేశారంటూ బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు.

Amit Shah Khammam Tour Schedule : ఖమ్మం 'రైతు గోస-బీజేపీ భరోసా' సభకు ముఖ్య అతిథిగా అమిత్​ షా.. షెడ్యూల్​ ఇదే

Etela Rajendar Fires on CM KCR : కేసీఆర్‌ను ఎదుర్కొనే శక్తి.. బీజేపీకి తప్ప మరొకరికి లేదు: ఈటల రాజేందర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.