కరోనా ఆపత్కాలంలో ప్రజలపై అధిక విద్యుత్ బిల్లులు భారం వేయడం ప్రభుత్వ వైఫల్యమని భాజపా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు భాష సత్యనారాయణ రావు ఆరోపించారు. ప్రభుత్వం విధించిన అధిక విద్యుత్ బిల్లులను నిరసిస్తూ నగరంలోని ఎస్ఈ కార్యాలయం ఎదుట భాజపా నేతలు అందోళన చేశారు.
పేదలపై అధిక బిల్లుల భారం వేయకుండా వాటిని మాఫీ చేయాలని... ప్రభుత్వమే ఆ భారాన్ని భరించాలని సత్యనారాయణ డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లులతో ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారని... ఇదేమని ప్రశ్నిస్తే... అరెస్టు చేసి.. కేసులు పెడతారా అని మండిపడ్డారు. వెంటనే విద్యుత్ బిల్లులు రద్దు చేయకపోతే... భారీ ఉద్యమాన్ని చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఇదీ చూడండి: కరోనా కట్టడి.. తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులతో గవర్నర్ సమీక్ష