లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్థికంగా దిగజారిన ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి.. అదనంగా బిల్లులు వసూలు చేయడం సరైన పద్దతి కాదని మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం వెంటనే ఆ బిల్లులను చెల్లించి ప్రజలు, అటు డిస్కంలపై భారం పడకుండా చూడాలన్నారు.
మాజీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, బొడిగె శోభ నేతృత్వంలో భాజపా నాయకులు కరీంనగర్ ఎస్‌ఈ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం ప్రజలపై భారం కాకుండా చూడాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈకు వినతిపత్రం అందజేశారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో లక్ష కల్లాల నిర్మాణం.. రూ.750 కోట్లు విడుదల