ఇంటర్మీడియట్ బోర్డు వైఫల్యాలపై కరీంనగర్లో భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. ఆర్ఐఓ కార్యాలయాన్ని ముట్టడికి యత్నించిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఇంటర్మీడియట్ బోర్డులో అవకతవకలను పాల్పడిన అధికారులను సస్పెండ్ చేసి, విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని భాజపా నేత బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ నామమాత్రం స్పందించి ఉచితంగా రీవాల్యుయేషన్ చేపడతామని చెప్పటం సిగ్గుచేటన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: "వారణాసి బయల్దేరిన నిజామాబాద్ పసుపు రైతులు"