కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై మాజీ ఎంపీ వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని కరీంనగర్ జిల్లా భాజపా అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు తెలిపారు. స్థాయికి మించి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో భాజపా ఎక్కడ అధికారంలోకి వస్తుందోనని తెరాసకు భయం పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు. తెరాస నాయకులే గుండాలుగా వ్యవహరిస్తూ... భాజపా అనడం సరికాదని విమర్శించారు. రాష్ట్రంలో భాజపాని బలోపేతం చేసేందుకు వారానికి ఒకసారి మంత్రులను పంపిస్తానని అమిత్ షా ప్రజలకు తెలపడం తప్పా అని ప్రశ్నించారు.
ఇవీ చూడండి: "కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్షమాపణ చెప్పాలి"