ETV Bharat / state

'నా బైక్​నే ఓవర్​టేక్​ చేస్తావా..? నీ బస్సుకెన్ని గేర్లు.. నీ ఇంజిన్​కెంత పికప్పు..!!' - biker attack on bus with stone

biker attack on rtc bus: "బైక్​ నడపటం మొదలుపెడితే.. నాకంటే స్పీడ్​గా ఎవరూ నడపలేరు. అలాంటిది నా బండినే ఓవర్​టేక్​ చేస్తావా..? నీ బస్సుకు ఎన్ని గేర్లు..! నీ ఇంజిన్​కు ఎంత పికప్పు..!!" అంటూ ఊగిపోయాడు ఓ ద్విచక్రవాహన చోదకశిఖామణి. తన బండిని ఓవర్​టేక్​ చేసినందుకు.. సినిమా స్టైల్లో బైక్​ను రోడ్డుకు అడ్డంగా పెట్టి.. బస్సు డ్రైవర్​ను తిడుతూ.. రచ్చరచ్చ చేశాడు. అప్పటికీ.. తన ఇగో సంతృప్తి చెందక.. ఏం చేశాడంటే..

younger argument with rtc bus driver
younger argument with rtc bus driver
author img

By

Published : Dec 3, 2021, 5:29 PM IST

Updated : Dec 3, 2021, 8:13 PM IST

biker attack on rtc bus: చేతిలో బైక్​ ఉంటే చాలు.. రయ్​రయ్​ మంటూ రోడ్డపై యువత చక్కర్లు కొట్టేస్తున్నారు. వాళ్లు వేళ్లే వేగానికి ఇతర వాహనదారులు భయపడాల్సిన పరిస్థితి. కొందరు యువకులు రోడ్ల మీద బైకులతో చేసే సాహసకృత్యాలు, విన్యాసాలు కొన్ని సార్లు వికటించి.. వాళ్లతో పాటు ఇతర వాహనదారులు సైతం ప్రమాదాలబారిన పడుతున్నారు. ఇదంతా ఓ ఎత్తైతే.. ఒకవేళ తన బైక్​ను దాటేసి వేరే వాహనాలు ముందుకెళ్తే మాత్రం వాళ్లు చేసే రచ్చ మరో ఎత్తు. వేగం పెంచి దూసుకెళ్లటమో.. లేక ఛేజ్​ చేసి మరీ దమ్కీలు ఇవ్వటమో.. చేస్తుంటారు.

biker fire on rtc bus driver: కరీంనగర్​ జిల్లా గంగాధరలో ఇలాంటి సన్నివేశమే చోటు చేసుకుంది. తన బైక్​ను దాటేసి వెళ్లినందుకు ఓ ఆర్టీసీ బస్సుపై ప్రతీకారం తీర్చుకున్నాడు ఓ యువకుడు. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. కరీంనగర్​ నుంచి జగిత్యాలకు వెళ్తోంది. గంగాధర సమీపంలో బస్సు యాదృశ్ఛికంగానే ఓ ద్విచక్రవాహనాన్ని ఓవర్​టేక్​ చేసి ముందుకెళ్లిపోయింది. అంతే.. ద్విచక్రవాహనదారునికి కోపం వచ్చింది. నా బైక్​ను దాటేసి బస్సు ఎలా వెళ్తుంది..? అని భావించాడో.. అంత వేగం ఆర్టీసీ బస్సుకు ఎందుకు..? అనుకున్నాడో.. ఓవర్​టేక్​ చేసే క్రమంలో తనకు జరగరానిదేమైనా జరిగితే ఎలా..? అని తలచాడో.. మొత్తానికి ఆగ్రహంతో ఊగిపోయాడు.

younger argument with rtc bus driver
దాడికి గురైన ఆర్టీసీ బస్సు

అదే కోపంలో.. బైక్​ వేగం పెంచాడు. ఈసారి ముందు వెళ్తున్న బస్సును తాను ఓవర్​టెక్​ చేశాడు. రోడ్డుకు అడ్డంగా బైక్​ పెట్టి.. బస్సును ఆపేలా చేశాడు. బైకును గమనించిన డ్రైవర్​.. ఎందుకు రోడ్డుకు అడ్డంగా పెట్టావని అడగటమే తరువాయి.. తిట్ల దండకం అందుకున్నాడు. తన బైకును ఎలా ఓవర్​టేక్​ చేస్తావంటూ.. గొడవకు దిగాడు. అంత వేగం అవసరమా అంటూ రంకెలేశాడు. బస్సులో ఉన్న ప్రయాణికులు, డ్రైవర్​, కండక్టర్​.. ఎంత చెప్పినా వినకుండా రచ్చ చేశాడు. ప్రయాణికులకు ఆలస్యం అవుతుండటంతో ఇక చేసేదేమీ లేక.. అందరూ కలిసి ఆ యువకునికి ఏదో విధంగా సర్దిచెప్పారు. బస్సును వెళ్లనివ్వాలని కోరారు. ఒప్పుకున్న యువకుడు.. బండి పక్కకు తీశాడు.

అంతటితో ఆ విషయం తేలిపోవటం.. ఆ యువకుడికి నచ్చలేదు. ఏదో ఒకటి జరిగితేనే తానలో ఉన్న ఇగో(అహం) సంతృప్తి చెందుతుందని తలచాడు. అప్పుడే.. ముందుకు వెళ్తున్న బస్సుపై కోపంతో రాయిని విసిరి.. బైక్​పై పరారయ్యాడు. ఆ రాయి తాకి బస్సు వెనక అద్దాలు పగిలిపోయాయి.

younger argument with rtc bus driver
ద్విచక్రవాహనదారుని దాడితో ధ్వంసమైన బస్సు అద్దాలు

ఈ ఘటనలో బస్సులో ఉన్న పిల్లలకు స్వల్పంగా దెబ్బలు తగిలాయి. ఎంత చెప్పినా వినని ఆ యువకుడి వికృత చేష్టలకు విసుగు చెందిన ఆర్టీసీ డ్రైవర్​ నేరుగా పోలీస్​ స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ప్రయాణికుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.. యువకుడి కోసం గాలింపు చేపట్టారు.

ఇదీ చూడండి:

Last Updated : Dec 3, 2021, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.