దేశంలో ఎక్కడా లేని విధంగా పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కొత్తపల్లి మండలానికి చెందిన 53 మంది కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యల గురించి మంత్రి వివరించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 వేల వరకు చెక్కులు ఈ పథకం క్రింద లబ్ధిదారులకు అందజేశానని సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డికి హైకోర్టులో ఊరట