బీసీ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పెండింగ్లో ఉన్న మెస్ చార్జీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అద్దె భవనాల్లో కొనసాగుతున్న వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మించాలని కోరారు. సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి : ఓయూ జేఏసీ విద్యార్థులతో భేటీ కానున్న ఆర్టీసీ ఐకాస