ETV Bharat / state

నేటితో ముగియనున్న బండి సంజయ్ పాదయాత్ర.. సాయంత్రం భారీ బహిరంగ సభ - బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర వార్తలు

Bandi Sanjay Padayatra: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేడు ముగియనుంది. గత నెల 28న నిర్మల్‌ జిల్లా భైంసాలో ప్రారంభమైన యాత్ర.. కరీంనగర్‌లో ముగియనుంది. యాత్ర ముగింపు వేళ బీజేపీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు.

Bandi Sanjay
Bandi Sanjay
author img

By

Published : Dec 15, 2022, 6:46 AM IST

Updated : Dec 15, 2022, 7:11 AM IST

నేటితో ముగియనున్న బండి సంజయ్ పాదయాత్ర.. సాయంత్రం భారీ బహిరంగ సభ

Bandi Sanjay Padayatra: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఐదో విడత నేటితో ముగియనుంది. గత నెల 28న నిర్మల్‌ జిల్లా భైంసాలో మొదలైన పాదయాత్ర.. ఐదు జిల్లాల్లో 18 రోజులు, 222 కిలోమీటర్లు సాగింది. ముథోల్‌, నిర్మల్‌, ఖానాపూర్‌, కోరుట్ల, వేములవాడ, జగిత్యాల, చొప్పదండి, కరీంనగర్‌ నియోజకవర్గాల్లో పర్యటించగా.. ఇవాళ కరీంనగర్‌లో ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగియనుంది.

భారీ బహిరంగ సభ..: పాదయాత్ర ముగింపు సందర్భంగా ఎస్​ఆర్​ఆర్​ కళాశాల మైదానంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ముగింపు సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి.. కేసీఆర్ గ్రాఫ్ కరీంనగర్‌లోనే అమాంతంగాపెరిగింది. కేసీఆర్ రాజకీయ భవిష్యత్తుకు అగ్రపీఠం వేసిన కరీంనగర్‌లోనే.. సభను విజయవంతం చేసి బీఆర్ఎస్ పని అయిపోయిందనే సంకేతాలు పంపాలని బీజేపీ యోచిస్తోంది.

రాష్ట్రంలో రాబోయేది బీజేపీ సర్కారేనని సంకేతాలు..: బీఆర్​ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, దిల్లీ లిక్కర్‌ స్కామ్​, బీఆర్​ఎస్ ఆవిర్భావంపై జేపీ నడ్డా ఏం వ్యాఖ్యలు చేస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. బహిరంగ సభ కోసం భారీగా జన సమీకరణ చేయాలని రాష్ట్ర నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలోని పోలింగ్ బూత్ కమిటీ సభ్యులంతా హాజరయ్యేలా ప్రణాళిక రూపొందించారు. బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా రాష్ట్రంలో రాబోయేది బీజేపీ సర్కారేనని సంకేతాలు ఇవ్వాలని కమలదళం భావిస్తోంది. బహిరంగ సభ వేదిక నుంచే ఆరో విడత ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్‌ను ప్రకటించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

"ఎస్​ఆర్ఆర్ కళాశాలలో భారీ బహిరంగ సభ కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. కరీంనగర్ జిల్లా నుంచే ఇతర ప్రాంతాల నుంచి కార్యకర్తలు తరలి వస్తారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేలా ఏర్పాట్లు చేశాం.రాష్ట్రంలోని పోలింగ్ బూత్ కమిటీ సభ్యులంతా హాజరయ్యేలా ప్రణాళిక రూపొందించాం." - గంగాడి కృష్ణారెడ్డి, బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ జిల్లా

ఇవీ చదవండి..:

దక్షిణాది విడిది కోసం తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము

'అప్పట్లో నెహ్రూ 100 మంది ప్రసంగం విన్నారు.. అలాంటి చర్చ అవసరం'

Last Updated : Dec 15, 2022, 7:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.