ETV Bharat / state

Bandi Sanjay on KTR : 'కేటీఆర్ మంత్రిగా ఉంటేనే భరించలేకపోతున్నాం.. సీఎం అయితే ప్రజలు తట్టుకోగలరా..?' - కేటీఆర్​పై బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay on KTR : కేటీఆర్​ను ముఖ్యమంత్రి చేస్తామని కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని మోదీ బయట పెట్టడంతో.. బీఆర్ఎస్ నిట్ట నిలువుగా చీలిపోయే అవకాశమున్నట్లు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మోదీ ప్రభుత్వం వస్తే మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావిస్తుంటే.. బీఆర్ఎస్ మాత్రం ప్రధానిని తెలంగాణ వ్యతిరేకి అని చిత్రీకరిస్తోందని మండిపడ్డారు. మంత్రిగా ఉంటేనే కేటీఆర్​ని భరించలేకపోతున్నామని.. ఇంకా సీఎం అయితే భరించగలమా అని వ్యాఖ్యానించారు

Bandi Sanjay Fires on KCR
Bandi Sanjay
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 4, 2023, 2:26 PM IST

Bandi Sanjay Fires on KCR కేటీఆర్ మంత్రిగా ఉంటేనే భరించలేకపోతున్నాం.. ఇంకా సీఎం అయితే భరించగలమా..?

Bandi Sanjay on KTR : రాష్ట్రంలో మోదీ ప్రభుత్వం వస్తే మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావిస్తుంటే.. బీఆర్ఎస్ మాత్రం ప్రధాని నరేంద్రమోదీని తెలంగాణ వ్యతిరేకి అని చిత్రీకరిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. కరీంనగర్​లో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్​పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పార్లమెంట్​లో తెలంగాణపై ప్రధాని మోదీ(Prime Minister Narendra Modi) విషం చిమ్మితే బీఆర్ఎస్ ఎంపీలు ఏం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అక్కడి వారికి కాకుండా కేవలం అజయ్​రావుకే వ్యతిరేకత కనబడిందా అని ప్రశ్నించారు.

Bandi Sanjay Comments on BRS Government : రాష్ట్ర అభివృద్ధికి సహకరించమని కోరడం కూడా విషం చిమ్మడం అవుతుందా అని బండి సంజయ్ కేసీఆర్ సర్కార్​ను నిలదీశారు. కేటీఆర్​ను ముఖ్యమంత్రి చేస్తామని కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని మోదీ బయట పెట్టడంతో.. బీఆర్ఎస్(BRS Party) నిట్ట నిలువుగా చీలిపోయే అవకాశముందని బండి సంజయ్ అన్నారు. మంత్రిగా ఉంటేనే భరించలేకపోతున్నామని.. ఇంకా సీఎం అయితే భరించగలమా అని ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. కేటీఆర్ అహంకారం, భాష తీరుతో ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని చెప్పారు.

Bandi Sanjay Fires On Telangana Government : గవర్నర్‌ రబ్బర్‌ స్టాంపుగా ఉండాలని బీఆర్ఎస్ కోరుకుంటోంది: బండి సంజయ్‌

Bandi Sanjay on KCR Family : ఇప్పటికే చాలామంది పోటీ నుంచి తప్పకునే అవకాశం కనిపిస్తోందని బండి సంజయ్ తెలిపారు. 'ప్రధాని మోదీనే చీటర్ అని అంటావా.. మీ తండ్రి పదవి కోసం నీ పేరునే అజయ్​రావు నుంచి తారక రామారావుగా మార్చాడు. మీ తండ్రిని మించిన చీటర్ ఎవరూ లేరు' అని సంజయ్ ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబంలోని నలుగురు కుటుంబ సభ్యులు ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చిందా అని ప్రశ్నించారు. కేసీఆర్​ను ఏ కూటమి నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు.

Bandi Sanjay Fires on KTR : కేసీఆర్ గత 15 రోజులుగా కనిపించడం లేదని.. పదవి కోసం తండ్రిని కేటీఆర్(Minister KTR) ఏమైనా చేశారా అని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఒకసారి కనబడి ప్రెస్​మీట్(Press Meet) పెడితే తమకు ఉన్న అనుమానం తీరుతుందని అన్నారు. కరీంనగర్​లో ఈద్గాకు 8 ఎకరాల స్థలం కేటాయించారని.. ప్రభుత్వ భూమి తమ జాగీరా అని మండిపడ్డారు. శిథిలావస్థలో ఉన్న దేవాలయాలు ఎన్నో ఉన్నాయని.. అయినా కేసీఆర్ సర్కార్ వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. తాను ఈ అంశాల మీద మాట్లాడకపోతే ఎనిమిది ఎకరాల కాదు వేల ఎకరాలు ఇస్తారని ఆరోపించారు. ముస్లిం మహిళలంతా బీజేపీ వైపే ఉన్నారని.. త్రిపుల్ తలాక్ బిల్లుతో ప్రజల్లో బీజేపీని గెలిపించాలన్న ఆసక్తి పెరిగిందన్నారు. కరీంనగర్​లో ఎంఐఎం కార్యకర్తలు రెచ్చిపోతున్నారని.. ఇక్కడ బీజేపీ లేకపోతే కరీంనగర్​ను ఎంఐఎం కబ్జా చేసి తీరుతుందని బండి సంజయ్ అన్నారు.

KTR Reacts to Modi Comments On BRS BJP Alliance : 'డిపాజిట్ రాని బీజేపీతో మాకు పొత్తా.. మేము పోరాడేవాళ్లమే తప్ప మోసంచేసే వాళ్లం కాదు'

KTR Anger Over PM Modi Comments in Nizamabad : కేసీఆర్ ఒక ఫైటర్‌... చీటర్‌తో కలవరు: మంత్రి కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.