Bandi Sanjay on Contesting Assembly Election 2023 : బీజేపీ చేస్తున్న దీక్షతో.. నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ చేసిన మోసాల బండారం బయట పడుతుందనే భయంతోనే కిషన్‌రెడ్డి దీక్షను భగ్నం చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay)ఆరోపించారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచి నిరుద్యోగుల పొట్టకొడతారా అని ప్రశ్నించారు. రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇచ్చేందుకూ నిధులు లేవని విమర్శించారు. కరీంనగర్ జిల్లాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay Fires on Telangana Government : రాష్ట్రంలో భూములమ్మి జీతాలు ఇచ్చే దుస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉందని.. బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణను రూ.5.5 లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని విమర్శించారు. కేసీఆర్ మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే ఆ అప్పులెలా తీరుస్తారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి బీజేపీ అంటేనే భయం వేస్తోందని.. అందుకే కాంగ్రెస్‌ను పైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
కేంద్రాన్ని విమర్శిస్తూ.. కాంగ్రెస్ ఇమేజ్ పెంచడం కోసం కేసీఆర్ పని చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఈ క్రమంలోనే ఒవైసీ చెబితేనే సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవంగా ముఖ్యమంత్రి ప్రకటించారని అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు. జమిలి ఎన్నికలంటే బీఆర్ఎస్ నేతలకు భయమెందుకు అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు వేర్వేరుగా వస్తే కరీంనగర్ అసెంబ్లీకి పోటీ చేస్తానని బండి సంజయ్ తెలిపారు.
మంత్రి గంగులతో తాను కుమ్మక్కు అయ్యాననడం సరికాదని బండి సంజయ్ తెలిపారు. తాను కుమ్మక్కయ్యే కోర్టుకు హాజరు కావడం లేదనే ఆరోపణ సరికాదని అన్నారు. పార్లమెంటు సమావేశాలుంటే కోర్టులో వాయిదా కోరుతుంటామని.. అందుకే కోర్టు ఆదేశాల ప్రకారం రూ.50,000 సైనిక నిధికి చెల్లించానని వివరించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై.. బండి సంజయ్ స్పందించారు.
BJP Leaders Nirasana Deeksha in Hyderabad : 'కేసీఆర్‌కు జమిలి ఎన్నికలు అంటే భయం పట్టుకుంది'
"కిషన్‌రెడ్డి దీక్షను భగ్నం చేయడాన్ని ఖండిస్తున్నా. కేసీఆర్ బండారం బయట పడుతుందనే దీక్ష భగ్నం చేశారు. నిరుద్యోగులకు కేసీఆర్ చేసిన మోసాలు తెలియాలి. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచి నిరుద్యోగుల పొట్టకొడతారా?. రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇచ్చేందుకు నిధులు లేవు. నిధులు లేకనే ఉద్యోగుల పదవీవిరమణ వయసు పెంచారు. భూములమ్మి జీతాలు ఇచ్చే దుస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉంది." - బండి సంజయ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ
Bandi Sanjay Bike Rally In Vemulawada : 'బండి సంజయ్ ఎక్కడ పోటీ చేయాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుంది'