Bandi Sanjay Letter To CM Revanth Reddy : త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్‌కు (CM Revanth Reddy) బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ లేఖ రాశారు. మిడ్ మానేరు ముంపు విషయంలో అర్హత లేకున్నా ప్యాకేజీ పరిహారం తీసుకున్న రాజ్యసభ సభ్యుడు సంతోష్‌రావుతో సహా మాజీ సీఎం కేసీఆర్ (KCR) కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయని అన్నారు.
కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తి వివరాలు అందించాలి : సీఎం రేవంత్ రెడ్డి
Bandi Sanjay On Mid Manair Issue : ఈ మేరకు దీర్ఘాకాలికంగా పెండింగ్‌లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యలని సంజయ్ (Bandi Sanjay) లేఖలో ప్రస్తావించారు. ఒక్కో బాధిత కుటుంబానికి ఇళ్ల నిర్మాణానికి రూ.5.04 లక్షలు చెల్లించాలని కోరారు. నీలోజిపల్లి నుంచి నందిగామ, ఆగ్రహారం నుంచి ఇండస్ట్రీయలక్ కారిడార్‌తో పాటు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీని ఏర్పాటు చేయాలని విన్నవించారు. మిడ్ మానేరు విషయంలో తక్షణనే సంబంధిత శాఖ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు.
-
దీర్ఘకాలికంగా పెండిగ్ లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ @TelanganaCMO శ్రీ @revanth_anumula గారికి లేఖ. pic.twitter.com/FRPIRuekyR
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) December 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">దీర్ఘకాలికంగా పెండిగ్ లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ @TelanganaCMO శ్రీ @revanth_anumula గారికి లేఖ. pic.twitter.com/FRPIRuekyR
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) December 18, 2023దీర్ఘకాలికంగా పెండిగ్ లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ @TelanganaCMO శ్రీ @revanth_anumula గారికి లేఖ. pic.twitter.com/FRPIRuekyR
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) December 18, 2023
లేఖలో 12 గ్రామాల రైతులు సాగు భూమిని కోల్పోయారని తెలిపారు. రెండెళ్ల క్రితం మిడ్ మానేరు ముంపు బాధితుల కోసం కొదురుపాకలో నిర్వహించిన మహాధర్నాలు వారితో పాటు రేవంత్ కూడా పాల్గొన్నారని, అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారి సమస్యలు తీరుస్తామని అన్నారని సీఎంకు గుర్తు చేశారు. 2009 కొత్త గెజిట్ ప్రకారం జనవరి 1 2016 నాటికి 18 ఏళ్లు నిండిన యువతి యువకులకు ముంపు పరిహారం, పట్టా ఇస్తానన్నారు, కానీ ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని లేఖలో తెలిపారు.
మిడ్ మానేరు నిర్మాణ పనులను అడ్డుకున్న గ్రామస్థులు
ప్రాజెక్టు పూర్తయిన తీరని సమస్యలు: రాజన్న సిరిసిల్లా జిల్లా బోయినిపల్లి మండలం మన్వాడలోని మిడ్ మానేరు ప్రాజెక్ట నిర్మాణం కోసం స్థానిక ప్రజలు తమ భూములు ఇచ్చారు. 2018లో ప్రాజెక్టు పూర్తయినా గ్రామస్థులకు పరిహారం చెల్లించలేదు. దీంతో పలుమార్లు నిర్వాసిత గ్రామాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం వద్ద నిర్వాసితులు ధర్నా నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం తాము సర్వస్వం త్యాగం చేశామన్నారు. ఇప్పుడు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరిగినా వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటివరకు రాజకీయ నాయకులు స్థానికులతోపాటు వారి సమస్యలపై పోరాడిన పరిష్కారం లేకుండా పోయింది.