రాష్ట్రంలో భాజపా జెండాను రెపరెపలాడేలా ఎగురవేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భాజపాను అధికారంలోకి తేవడమే లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయ పార్టీ భాజపా మాత్రమేనని పునరుద్ధాటించారు. భైంసాలో నిరుపేదలకు రక్షణగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. లక్ష్మణ్ చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్... తనను నియమించిన పార్టీ అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపారు. సిద్ధాంతాన్ని నమ్ముకుని పని చేస్తున్న తనను నమ్మి బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. భారీ మెజార్టీతో ఎంపీగా గెలిపించిన కరీంనగర్ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.