ETV Bharat / state

BANDI SANJAY KUMAR: 'కేసీఆర్ ఎన్నికలప్పుడే బయటికొస్తారు.. అప్పుడే హామీలిస్తారు' - భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్

తెరాస ఎన్నికల మానిఫెస్టోను అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తుల ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్ తెలిపారు. కరీంనగర్​లో ఆయన మీడియాతో మాట్లాడారు.

bandi-sanjay-kumar-speaks-about-dalitha-bandhu
అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు చేయాలి..
author img

By

Published : Aug 16, 2021, 2:15 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తుల ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఎన్నికలప్పుడు మాత్రమే బయటకు వస్తారని.. అప్పుడే హామీలను అమలు చేస్తారని మండిపడ్డారు. దళిత బంధు పథకాన్ని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు చేయాలి..

టీఆర్​ఎస్ పార్టీ ప్రభుత్వమూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి హామీలిచ్చిర్రు కాబట్టి, మీరు నెరవేరుస్తరు కాబట్టి, నెరవేరుస్తరన్న విశ్వాసం మాలోపట ఉంది కాబట్టి మీకు సహకరించడానికే ఈ ఉద్యమం. మీరిచ్చిన హామీలు నెరవేర్చమని ప్రజలు మా వద్దకు వస్తే... మా కార్యకర్తలు గల్లీ గల్లీ, గ్రామగ్రామం, బస్తీబస్తీ మండలాల వారిగా, జిల్లాల వారిగా తిరిగి, ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులను అర్హులైన ప్రతీ ఒక్కరికి ఈ దరఖాస్తు ఫారాలిచ్చి, దరఖాస్తు ఫారాలను తీసుకొని మీకు అందజేయడమే... ఈ ఉద్యమం. దీన్ని స్వీకరిస్తరా.. స్వీకరించరా అది మీ ఇష్టం. మీ ప్రభుత్వం ఇష్టం. మీ పార్టీ ఇష్టం. రాష్ట్ర ముఖ్యమంత్రిగారి ఇష్టం. - బండి సంజయ్ కుమార్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

బీసీలకూ కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని బండి సంజయ్ కుమార్ అన్నారు. నిరుద్యోగ భృతి బకాయిలతో సహా చెల్లించాలని కోరారు. పోడు భూముల సమస్య గురించి సీఎం కేసీఆర్ మరచిపోయారని... పోడు వివాదాల్లో బాలింతలను కూడా జైలుకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేర్చాలని సూచించారు.

ఎన్నికలప్పుడు మాత్రమే ముఖ్యమంత్రిగారు బయటకు వస్తరు. ఉప ఎన్నికలొస్తే హామీ ఇస్తరు. దళితబంధు ప్రారంభిస్తా అన్నడు చాలా మంచిదే. దాన్ని వ్యతిరేకించలే మేం ఎక్కడ కూడా. కానీ హుజురాబాద్ ఎన్నికలు రాగానే.. హుజురాబాద్ కేంద్రంగానే ఎందుకు ప్రారంభిస్తున్నరో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలె. - బండి సంజయ్ కుమార్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

మాజీ ప్రధాని వాజపేయీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బండి సంజయ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళితల మీద అంత ప్రేమ ఉండి ఉంటే.. మూడెకరాల భూమి ఇచ్చి ఉండేవారని బండి సంజయ్ తెలిపారు. ఒకవేళ మూడెకరాల భూమి ఇచ్చి ఉంటే 30 లక్షల మేర లబ్ధి చేకూరేదని స్పష్టం చేశారు. కేవలం హుజురాబాద్‌ ఎన్నికల కోసమే దళిత బంధు పేరిట కొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. గాంధేయ మార్గంలో చేపట్టే దరఖాస్తుల ఉద్యమంలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ప్రభుత్వం పరిష్కరిస్తుందని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: KTR: 'అంబేడ్కర్​ ఆశయాల దిశగా తెరాస పాలన'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.