Bandi Sanjay Mulakath: కరీంనగర్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఆయన సతీమణి అరుణ, సోదరుడు శ్రవణ్, కుమారుడు ములాఖాత్‌లో కలిశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ పోలీసులకు పలు సూచనలు చేసినట్లు సతీమణి మీడియాకు వెల్లడించారు. పోలీసులు తనను అదుపులో తీసుకున్నప్పటి నుంచి అండగా ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు చెప్పినట్లు పేర్కొన్నారు.
ఈ అరెస్టులకు తాను భయపడేది లేదని 30లక్షల మంది యువకుల తరఫున పోరాడుతున్నట్లు ఆమె తెలిపారు. తనను ఆరెస్ట్ చేయడం పట్ల బాధ పడటం లేదని.. అరెస్టు చేసిన సందర్భమే బాగాలేదని అన్నట్లు చెప్పారు. అత్తయ్య కర్మకు హాజరయ్యేందుకు వచ్చిన తనను అక్రమంగా అరెస్టు చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వివరించారు. పోలీసులకు మొన్ననే విడుదలైన బలగం సినిమా చూపెడితే బాగుండేదని ఫ్యామిలీ ఎమోషన్స్ అర్ధమయ్యేవని.. బండి సంజయ్ అన్నట్లు ఆమె మీడియాకు వివరించారు. మరోవైపు ఈనెల 8వ తేదీన జరగనున్న ప్రధాని సభను విజయవంతం చేయాలని.. తన భర్త కోరినట్లు ఆమె తెలిపారు.
"రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ పోరాటం చేయాలి. ఇలానే ఎలక్షన్ చివరి వరకు చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 8న ప్రధాని నరేంద్రమోదీ సభకు రాలేకపోతున్నాననే బాధ తనలో ఎక్కువగా ఉందని చెప్పారు. తాను 30 లక్షల మంది యువత కోసం కష్టపడుతుంటే.. గవర్నమెంట్ తనని అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసిందని సంజయ్ బాధపడ్డారు." - అపర్ణ, బండి సంజయ్ భార్య
బండి సంజయ్ అరెస్ట్‌కు దారి తీసిన క్రమం: పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ప్రధాన కుట్రదారునిగా చూపుతూ పోలీసులు అభియోగం మోపారు. వరంగల్ జిల్లాలోని కమలాపురంలో జరిగిన పేపర్ లీకేజీలో కేసులో బండి సంజయ్‌ను ప్రధాన నిందితునిగా చేర్చి.. అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా బీజేపీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు రోడ్లుపైకి వచ్చి తమ నిరసనలు తెలిపారు.
వాటిని సామాజిక మాధ్యమాల్లో పంపించడం వల్ల.. విద్యార్థులను గందరగోళ స్థితిలోకి నెట్టేసే యత్నం చేస్తున్నారని భావించారు. వెంటనే బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి.. 120 (బి), 420, 447, 505 (1) (బి) ఐపీసీ, 4(ఎ), 6, రెడ్ విత్ 8 ఆఫ్ టీఎస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్) యాక్ట్- 1997, సెక్షన్ 66-డి ఐటీ యాక్ట్-2008 కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అతనికి 14 రోజుల రిమాండ్‌ను విధించి.. కరీంనగర్‌లోని కారాగారానికి తరలించారు. గురువారం హైకోర్టులో బండి సంజయ్ అరెస్ట్‌పై విచారణ జరిగింది. ఈ కేసును మూడు రోజుల పాటు హైకోర్టు వాయిదా వేసింది.
ఇవీ చదవండి: