ETV Bharat / state

Bandi Sanjay Fires on CM KCR : రాష్ట్రంలో బీజేపీకి గ్రాఫ్​ తగ్గలేదు.. బీఆర్​ఎస్​ను ఎదుర్కొనే సత్తా మా పార్టీకి మాత్రమే ఉంది : బండి సంజయ్

Bandi Sanjay Fires on CM KCR : ఆదిలాబాద్​ జిల్లాలో కేంద్ర మంత్రి అమిత్​ షా సభతో రాష్ట్రంలో బీజేపీకి జనాధారణ పెరిగిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్​ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో కేంద్ర నిధులు ఉన్నాయని తెలిపారు. తనపై తప్పుడు వార్తలు రాసిన పత్రికపై మండిపడ్డారు.

Bandi Sanjay React on Paper News
Bandi Sanjay Comments on CM KCR
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 11, 2023, 2:09 PM IST

Updated : Oct 11, 2023, 3:10 PM IST

Bandi Sanjay Fires on CM KCR : బీఆర్​ఎస్​ పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్​ అన్నారు. కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో కాస్త అభివృద్ధి జరిగిందని.. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమదిగా చెప్పుకుంటుందని ఆరోపించారు. కరీంనగర్​ జిల్లాలో బండి సంజయ్​ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదిలాబాద్​ జిల్లాలో కేంద్రమంత్రి అమిత్​ షా సభకు విపరీతమైన జానాధరణ వచ్చిందని.. బీజేపీకి అనుకూల వాతావరణం వచ్చిందని అన్నారు. కొంత మంది నాయకులు బీజేపీకి రాష్ట్రంలో గ్రాఫ్​ తగ్గిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్​ఎస్​ను ఎదుర్కొనే సత్తా బీజేపీకు మాత్రమే ఉందని అన్నారు.

Bandi Sanjay React on Paper News : రాష్ట్రంలో బీఆర్​ఎస్​ నేతల కబ్జాలు, వేధింపులు తట్టుకోలేక చాలా కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నాయని సంజయ్ ఆరోపించారు. ఇదే సమయంలో ఓ పత్రికలో తాను బీఆర్​ఎస్​కు​ ఓటు వేయమని ప్రచారం చేస్తున్నట్లు వచ్చిన వార్తపైనా బండి సంజయ్​ స్పందించారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలిస్తే ఓటేయమని అన్నానని వివరణ ఇచ్చారు. నిజంగానే ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం, పేదలకు డబుల్​ బెడ్​ రూం ఇస్తే ఓటు వేయమన్నానని.. ఇవి ఎందుకు పత్రికలో రాయలేదని నిలదీశారు. రాష్ట్రంలో అభివృద్ధి చేసింది.. చేసేది బీజేపీనేనని తెలిపారు.

Bandi Sanjay Comments on KCR : దమ్ముంటే.. కేటీఆర్​ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి: బండి సంజయ్​

Bandi Sanjay Latest Comments : కేంద్రం నిధులు ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కాస్త అభివృద్ధి చేసిందని సంజయ్​ పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము ఒకరిది.. సోకు ఇంకొకరిది అన్నట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు పేరుతో గొప్పలు చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పంటలు నష్టపోతే పరిహారం ఎందుకు చెల్లించ లేదని ప్రశ్నించారు. బీఆర్​ఎస్​ మేనిఫెస్టో(Manifesto) దిమ్మ తిరుగుతుందని ఆ పార్టీ నాయకులు చెప్పడం జోక్​గా​ ఉందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీజేపీనేనని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్​ ప్రకటించిన 100 మందికి బీ ఫారాలు ఇస్తారన్న గ్యారెంటీ లేదని ఎద్దేవా చేశారు.

Bandi Sanjay Comments on MIM Party : 2019లో బీఆర్​ఎస్​ మేనిఫెస్టోలో ఎంత వరకు అమలు చేశారో తెలియజేయాలని.. దీనిపై హైదరాబాద్​లో అమరవీరుల విగ్రహం దగ్గర చర్చకు సిద్దమా అని బండి సంజయ్​ సవాలు విసిరారు. కేసీఆర్​ ఆరోగ్యంపై తనకున్న శ్రద్ద మంత్రి కేటీఆర్​కు లేదని ఆరోపించారు. కేసీఆర్​ ఆరోగ్యం బాగుండాలని.. ఏవైనా ఉంటే రాజకీయ పరంగా చూసుకుంటామని అన్నారు. బీజేపీ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందన్న అమిత్ షా(Amit Shah) కామెంట్స్ నిజం కాదా అని ప్రశ్నించారు. ఓల్డ్ సిటీని న్యూ సిటీగా ఎందుకు మార్చడం లేదని చెప్పాలని అన్నారు. జనసేనతో పొత్తు గురించి అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు.

Bandi Sanjay on KTR : 'కేటీఆర్ మంత్రిగా ఉంటేనే భరించలేకపోతున్నాం.. సీఎం అయితే ప్రజలు తట్టుకోగలరా..?'

"వారెంటీ లేని పార్టీ గ్యారెంటీలు ఇస్తే ప్రజలు నమ్మరు. కేంద్రం సహకారం లేకుండా రాష్ట్రంలో కాంగ్రెస్​ ఎలా అభివృద్ధి చేస్తుంది. సామన్యులు సొంత అవసరాలు కోసం తీసుకెళ్తున్న డబ్బును సీజ్​ చేస్తున్నారు. పదవీకాలం పొడగించి సీఎం పేషీలో ఉన్న అధికారులను, ఇంటెలిజెన్స్ అధికారులను బదిలీ చేయాలి. దీనిపై మేము ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేస్తాం. కరీంనగర్​లో పోటీ చేయాలని నా కోరిక.. అధిష్టానం ఆదేశిస్తే తప్పకుండా పోటీ చేస్తాను."- బండి సంజయ్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

Bandi Sanjay Fires on CM KCR : రాష్ట్రంలో బీజేపీకి గ్రాఫ్​ తగ్గలేదు

Bandi Sanjay Speech In Adilabad Meeting : రాష్ట్రంలో పేదల ప్రభుత్వమే వస్తుంది : బండి సంజయ్

Bandi Sanjay Fires on BRS : ఒక వర్గానికే కొమ్ము కాస్తే ఊరుకునే ప్రసక్తే లేదు : బండి సంజయ్

Last Updated : Oct 11, 2023, 3:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.