మాజీ శాసనసభ్యులు బొమ్మ వెంకన్న ఆశయాలను కొనసాగిస్తామని భాజపా రాష్ట్ర అద్యక్షుడు బండిసంజయ్‌తో పాటు పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్‌లో వెంకన్న కాంస్య విగ్రహ ఆవిష్కరణతో పాటు మున్నూరు కాపు వసతి గృహ నిర్మాణ కార్యక్రమానికి పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు. రాజకీయాలకు అతీతంగా ఎంపీ బండి సంజయ్‌తో పాటు మంత్రి గంగుల కమలాకర్ కాంస్య విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. రాజకీయంగా విమర్శలు చేసుకొనే ఇద్దరు నాయకులు పక్కపక్కనే కూర్చొని ముచ్చటించుకోవడం ఆసక్తికరంగా కనిపించింది.
కులాభివృద్ధి కోసం బొమ్మ వెంకన్న ఎనలేని కృషి చేశారని బండి సంజయ్ కొనియాడారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా ఆయన ధర్మం కోసం పనిచేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని మంత్రి గంగుల వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో పాటు కార్యనిర్వాహక అద్యక్షుడు పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బొమ్మ వెంకన్న సేవలను నాయకులు కొనియాడారు.
ఇదీ చదవండి: నిధులు ఇవ్వకపోవడం వల్ల కేఎంసీ ప్రారంభోత్సవం జాప్యం: కిషన్‌రెడ్డి