Attacks on old woman brutally : పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలోని మార్కెట్లో కూరగాయలు అమ్ముతున్న నర్సమ్మ అనే వృద్ధురాలిపై కొండయ్య అనే వ్యక్తి విచక్షణ రహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో నర్సమ్మ తీవ్రంగా గాయపడింది. రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న నర్సమ్మను గమనించిన స్థానికులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.
వృద్ధురాలిపై దాడి చేసిన తర్వాత కొండయ్య నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై కొండయ్యను విచారిస్తున్నారు. ఈ ఘటన పాత కక్షల వల్లే చోటుచేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.