తమకు వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. సీఐటీయు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళనకు జిల్లాలోని ఆశా వర్కర్లంతా హాజరయ్యారు. తమతో వివిధ రకాలు సేవలు చేయించుకుంటున్నా వేతనాలు మాత్రం పెంచట్లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాల చెల్లింపులో ప్రభుత్వం చేస్తున్న జాప్యం వల్ల ఆశా కార్యకర్తలు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారని సీఐటీయు నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: ర్యాంక్ రాని విద్యార్థులు ఆందోళన చెందొద్దు!