ETV Bharat / state

వారసులను పదవుల్లో కూర్చోబెట్టాలని కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం: అమిత్ షా - అమిత్ షా ఎన్నికల ప్రచారం

Amit Shah at Jammikunta BJP Public Meeting : కేంద్రంలో అలాగే రాష్ట్రంలో బీజేపీ ఉంటేనే.. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కేంద్రమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. తమ వారసులను పదవుల్లో కూర్చోబెట్టాలని కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం ఉందని ఆరోపించారు. బీజపీ గెలిస్తే.. రాష్ట్రానికి బీసీ వ్యక్తి తొలి సీఎం అవుతారని స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గిస్తామని తెలిపారు. పేద మహిళలకు ఏడాదికి 4 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే తెలంగాణ ప్రజలకు ఉచితంగా అయోధ్య దర్శనం కల్పిస్తామని చెప్పారు.

Amit Shah at Jammikunta BJP Public Meeting
Amit Shah
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 27, 2023, 3:36 PM IST

Updated : Nov 27, 2023, 3:51 PM IST

వారసులను పదవుల్లో కూర్చోబెట్టాలని కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం: అమిత్ షా

Amit Shah at Jammikunta BJP Public Meeting : తమ వారసులను పదవుల్లో కూర్చోబెట్టాలని కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఒప్పందం ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah)విమర్శించారు. జమ్మికుంటలో బీజేపీ నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో అమిషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్(BRS Party) అవినీతి పాలన నుంచి ప్రజలకు విముక్తి కలగాలన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ మధ్య లోపాయకారీ ఒప్పందం ఉందని ఆరోపించారు.

Amit Shah Election Campaign in Jammikunta : తమ వారసుల పదవుల కోసం పరస్పరం సహకరించుకుంటున్నాయని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైసీకి భయపడి తెలంగాణ విమోచనదినోత్సవాన్ని ఈ ప్రభుత్వం నిర్వహించటం లేదని విమర్శించారు. మజ్లిస్‌కు భయపడి 4 శాతం ముస్లిం రిజర్వేషన్లు చేశారని చెప్పారు. తెలంగాణకు మోదీ సర్కార్‌ రూ.7 లక్షల కోట్లు ఇచ్చిందని అమిత్ షా గుర్తుచేశారు. బీజేపీ గెలిస్తే.. రాష్ట్రానికి బీసీ వ్యక్తి తొలి సీఎం అవుతారని స్పష్టం చేశారు.

'బీఆర్ఎస్ అవినీతి పాలన నుంచి ప్రజలకు విముక్తి కలగాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ మధ్య లోపాయకారీ ఒప్పందం ఉంది. తమ వారసులను పదవుల్లో కూర్చోబెట్టాలని కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం ఉంది. తమ వారసుల పదవుల కోసం పరస్పరం సహకరించుకుంటున్నాయి. తెలంగాణకు మోదీ సర్కార్‌ రూ.7 లక్షల కోట్లు ఇచ్చింది. బీజేపీ గెలిస్తే.. రాష్ట్రానికి బీసీ వ్యక్తి తొలి సీఎం అవుతారు. బీజేపీ గెలిపిస్తే.. తెలంగాణ ప్రజలకు ఉచితంగా అయోధ్య దర్శనం కల్పిస్తాం. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ఉంటేనే.. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.' -అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి

బీజేపీ అధికారంలోకి వస్తే పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తాం : అమిత్‌ షా

Jammikunta BJP Public Meeting : బీజేపీ అధికారంలోకి వస్తే.. పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గిస్తామని అమిత్ షా తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. పేద మహిళలకు ఏడాదికి 4 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభం అవుతుందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ గెలిపిస్తే.. తెలంగాణ ప్రజలకు ఉచితంగా అయోధ్య దర్శనం కల్పిస్తామన్నారు. కేంద్రంలో అలాగే రాష్ట్రంలో బీజేపీ ఉంటేనే.. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అమిత్ షా వివరించారు.

'కారు' స్టీరింగ్ ఎప్పుడూ మజ్లిస్ చేతిలోనే - కేసీఆర్‌ను ఇక ఇంటికి సాగనంపే టైమొచ్చింది : అమిత్​ షా

బీఆర్ఎస్ గెలిస్తే ప్రజల సొత్తు లూటీ - అందుకే కేసీఆర్​ను గద్దె దించాలని తెలంగాణ ఫిక్స్ అయింది : అమిత్​ షా

Last Updated : Nov 27, 2023, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.