రెవెన్యూ సిబ్బందిపై పెట్రోల్ చల్లిన కేసులో నిందితుడు కనకయ్యను కరీంనగర్ జిల్లా కారాగారంలో అఖిల భారత కిసాన్‌సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి కలిశారు. కనకయ్య రెవెన్యూ సిబ్బందిపై పెట్రోలు చల్లే ప్రయత్నం చేయలేదని..రెవెన్యూశాఖతో విసిగి వేసారి తనకు తానే ఆత్మహత్య చేసుకోవాలని భావించాడని పేర్కొన్నారు. సిబ్బంది అతన్ని అడ్డుకునే క్రమంలో పెట్రోలు సిబ్బందిపై పడిందని అన్నారు. ఏది ఏమైనా ఇలాంటి చర్యలకు పాల్పడటం చట్ట వ్యతిరేకమన్నారు. భూసమస్యలు ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వం వెంటనే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి పట్టాదారు పాసుపుస్తకాలు అందించాలని కోదండరెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'మున్సిపాలిటీ ఎన్నికల వ్యాజ్యాలకు వేర్వేరు కౌంటర్లు వేయండి'