కేంద్రంలో నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని ఉమ్మడి రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ మాజీ అధ్యక్షుడు కొయ్యడ సృజన్ కుమార్ సూచించారు. ఏఐఎస్ఎఫ్ 85వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ ముందు జెండాను సృజన్ కుమార్ ఎగురవేశారు.
కేంద్రంలో ప్రవేశ పెట్టిన నూతన జాతీయ విద్యా విధానం ఏకపక్ష పద్ధతుల్లో ఉందని పాఠ్యపుస్తకాల్లో మత ఛాందస భావాలను చొప్పించడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. విద్యారంగాన్ని కార్పొరేట్,ప్రైవేట్ శక్తులకు తాకట్టు పెట్టడానికి ప్రయత్నం జరుగుతోందని వాపోయారు. రాష్ట్రంలో కేజీ టూ పీజీ విద్య హామీలకే పరిమితమైందని మండిపడ్డారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు.