కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కృష్ణానగర్, బొమ్మకల్ కాలనీల్లో అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. 200 మంది పోలీసు బలగాలు పాల్గొన్న ఈ కట్టడి ముట్టడిలో సరైన ధ్రువీకరణ పత్రాలు లేని సుమారు 2 వందల ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
కాలనీలో దొంగతనాలు జరగకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డీసీపీ ప్రజలకు సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ కొరకే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని.. ప్రజలు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండిః సైబర్ నేరాల కట్టడికి భాగ్యనగరంలో ఇన్నోవేషన్ సెంటర్