కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్‌లో ఎన్నికల స్ట్రాంగ్ రూమ్‌ను కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బ్యాలెట్ పత్రాలు భద్రపరిచిన గది, బ్యాలెట్ లెక్కింపు కేంద్రాల్లోని ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. అనంతరం ఎంపీడీవోలు, రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు.
నియోజకవర్గంలోని చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల ప్రాదేశిక ఎన్నికల బ్యాలెట్లు రుక్మాపూర్ మోడల్ పాఠశాలలో భద్రపరిచారు. మూడు జడ్పీటీసీ స్థానాలు, 39 ఎంపీటీసీ స్థానాలకు ఇక్కడి నుంచే ఫలితాలు వెలువడనున్నాయి.
![INSTRUCTIONS TO ELECTION OFFICERS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3435076_collector.jpg)
ఇవీ చూడండి : కోదాడలో ఓటేసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్