ETV Bharat / state

కరీంనగర్​పై కరోనా పంజా.. ఒక్కరోజే 32 కేసులు - కరీంనగర్​లో కరోనా తాజా వార్తలు

కరీంనగర్ జిల్లాలో కరోనా ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. జిల్లావ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 32 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజల్లో కలవరం మొదలైంది.

32 corona positive cases in karimnagar
కరీంనగర్​పై కరోనా పంజా.. ఒక్కరోజే 32 కేసులు
author img

By

Published : Jul 10, 2020, 10:22 AM IST

కరీంనగర్​ జిల్లాలో కొవిడ్​-19 కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం తాజాగా 32 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 216కు చేరింది. ఇందులో కొంతమంది చికిత్స అనంతరం ఆసుపత్రుల నుంచి డిశ్చార్జీ కాగా.. మరికొంత మంది హోం క్వారంటైన్​లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.

తాజా కేసులు భగత్​నగర్​, బ్యాంకు కాలనీ, కోతిరాంపూర్, కాపువాడ, జాఫ్రీ రోడ్, సూర్యనగర్, సప్తగిరి కాలనీ, హుసేన్​పురా, విద్యానగర్, వావిలాలపల్లి ప్రాంతాల్లో వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో నగరంలో నేటి నుంచి 3 రోజుల పాటు వ్యాపార సంస్థలు మూసివేయాలని నిర్ణయించారు.

దాదాపు నగరంలోని అన్ని కాలనీల్లో కేసులు నమోదవుతుండటం వల్ల ప్రజలు ఆందోళన చెందుతుండగా.. అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది.

32 corona positive cases in karimnagar
కరీంనగర్​పై కరోనా పంజా.. ఒక్కరోజే 32 కేసులు

ఇదీచూడండి: నాగ్​పుర్ సెంట్రల్ జైలులో 132 మంది ఖైదీలకు కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.