కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లిలోని ఓ పొలంలో కొండ చిలువ హల్చల్ చేసింది. నిమ్మల కొమురయ్య తన వరిపొలంలో కొంత కాలంగా ఓ కొండ చిలువ తిరుగుతున్నట్లు గుర్తించాడు. తోటి గ్రామస్థుల సహాయంతో భారీ కొండచిలువను పట్టుకున్నాడు. వరికొయ్యల్లో చిక్కిన్న ఆ పామును కర్రల సాయంతో బయటకు తీసుకొచ్చారు. సుమారు పది అడుగులకు పైగా ఉన్న భారీ సర్పాన్ని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
ఇదీ చూడండి : తెలంగాణ కుంభమేళకు యంత్రాంగం సన్నద్ధం..!