జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరులో ఓ యువకుడు అధికారులపై పెట్రోల్ దాడి చేశారు. దారి విషయంలో ఉన్న వివాదాన్ని పరిష్కరించేందుకు వెళ్లిన అధికారులపై గంగాధర్ అనే స్థానికుడు.. క్రిమిసంహారక మందులు పిచికారి చేసే స్ప్రేయర్ తో పెట్రోల్ తో స్ప్రే చేసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఎంపీవో రామకృష్ణకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
వెంటనే తన చొక్కా తీసేయగా.. అక్కడక్కడా గాయాలయ్యాయి. ఎంపీవోను వెంటనే జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సైతో పాటు పలువురు అధికారులు పరుగులు తీయడంతో మంటల నుంచి తప్పించుకున్నారు. అయితే గంగాధర్ ఇంటి వద్ద దారి విషయం లో కొంతకాలంగా వివాదం నడుస్తోంది. అదే విషయమై గంగాధర్.. రోడ్డుకు అడ్డంగా కట్టెలు పెట్టాడు. ఎవరు నడవకుండా దారి మూసేశాడు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఎస్సై గౌతమ్ పవర్, తహశీల్దార్ అరిపోద్దిన్, ఎంపీవో రామకృష్ణ వెళ్లారు. అప్పటికే పెట్రోల్ నింపిన స్ప్రేయర్‌తో ఉన్న గంగాధర్.. అధికారులపై పెట్ర్లో పిచికారి చేశాడు. అతన్ని ఆపేందుకు ఎస్సై ప్రయత్నించినా.. విఫలమయ్యారు. అంతలోనే అక్కడే ఉన్న ఎంపీవోకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: