Women Slapped Rice merchant: బియ్యం వ్యాపారిని ఓ మహిళ చెప్పుతో కొట్టిన ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన ఓ బియ్యం వ్యాపారికి మాచారెడ్డి మండలం భవానిపేట్ తండాకు చెందిన మోహన్, సాయిలు అనే రైతులు.. తమ పంట బియ్యాన్ని సరఫరా చేశారు. ఆ బియ్యానికి సంబంధించిన డబ్బులు.. సుమారు 50 వేల రూపాయలు రైతులకు ఆ వ్యాపారి ఇవ్వాల్సి ఉంది.
డబ్బులు ఇవ్వమని అడిగినప్పుడల్లా.. ఇప్పుడిస్తా.. అప్పుడిస్తా.. అంటూ దాటవేస్తున్నాడు. గురువారం(జనవరి 27) మధ్యాహ్నం సమయంలో మోహన్ కుటుంబసభ్యులు.. సిరిసిల్లా రోడ్డులోని దుకాణం దగ్గరకు వచ్చారు. డబ్బులు ఇవ్వాలని వ్యాపారిని అడిగారు. ఈ క్రమంలో వ్యాపారికి మోహన్ కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరగటంతో.. ఓ మహిళ వ్యాపారిని చెప్పుతో కొట్టింది. మరో మహిళ వ్యాపారిపై చేయిచేసుకుంది. అక్కడే ఉన్న స్థానికులు మహిళలను ఆపి సముదాయించారు.
"మేము అతడికి బియ్యం అమ్మినం. వాటి డబ్బులు సుమారుగా.. 50 వేల రూపాయలు అతడి నుంచి ఇంకా రావాల్సి ఉంది. ఎన్నిసార్లు అడిగినా.. ఇవ్వటంలేదు. ఈరోజు వచ్చి అడిగిన మా భార్యలను ఇష్టమున్నట్టు తిడుతూ.. చేతులు పట్టుకుని లాగుతున్నాడు." - బాధిత రైతులు..
ఇదీ చూడండి: