కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో మొదటి కరోనా మృతి కేసు నమోదైంది. ఓ రేషన్ డీలర్ సతీమణి కొవిడ్ వ్యాధితో శనివారం మృతి చెందింది. ఆమెకు చెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమెకు శుక్రవారం కరోనా నిర్ధరణ పరీక్ష చేయించగా పాజిటివ్ అని తెలిసింది.
అప్పటిదాకా అందరితో కలిసి ఉన్న ఆమె శనివారం తెల్లవారుజామున శ్వాసతో ఇబ్బంది పడి మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మున్సిపల్ సిబ్బంది .. మృతురాలికి అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చదవండి: మహిళల్లో కరోనా ప్రభావం తక్కువ.. కారణం అదే!