దీపావళి అనగానే టపాసులు కాల్చడం, తీపి వంటలు తినడం ఆనవాయితీ. కానీ కామారెడ్డి జిల్లా జుక్కల్లో మాత్రం ఓ వింత ఆచారం ఉంది. దీపావళి రోజున అక్కడ వయస్సుకు వచ్చిన ముగజీవాలకు పెళ్లి చేయడం అనాదిగా వస్తోంది.
మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులో ఉండటం వల్ల... ఈ ఆచారం జుక్కల్ ప్రాంతంలోనూ కొనసాగుతోంది. గొర్రెలే జీవనాధారంగా ఉన్న కురుమలు... దీపావళికి గొర్రెల పెళ్లి తంతు నిర్వహిస్తారు. ఏడాది వయసు ఉన్న గొర్రె పిల్లలకు వివాహం జరిపించి, ప్రత్యేక పూజలు చేసి మంగళారతులు ఇస్తున్నారు.
ఇదీ చూడండి : ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు