కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలం బస్వాపూర్‌కు చెందిన గుజ్జరి రమేష్ ఆటోను గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేశారు. సరిగ్గా వారంరోజుల క్రితం గ్రామంలో ఇలాగే దుండగులు మరొక ఆటోను తగలబెట్టడం గమనార్హం.
గ్రామంలో వరుసగా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దుండగులను పట్టుకొని శిక్షించాలని బాధితులు, గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: కందిపంటకు నిప్పుపెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు