ETV Bharat / state

కంటతడి పెట్టిస్తున్న.. కత్తెర పురుగు - కామారెడ్డి జిల్లాలో

ఖరీఫ్‌  ఆరంభం నుంచే కర్షకులను ప్రకృతి కలవరపెడుతూనే ఉంది. నైరుతి రుతుపవనాల ఆగమనంలో మందగమనంతో, నెల రోజులు ఆలస్యంగా  వర్షాలు కురుస్తున్నాయి. రైతులు కష్టాన్ని నమ్ముకొని విత్తు విత్తితే.. మొలకెత్తే దశలోనే చీడపీడలు విజృంభిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో మొలక దశలోనే కత్తెర పురుగు ఆశించడంతో మొక్కజొన్న రైతులు కలవరపడుతున్నారు.

కంటతడి పెట్టిస్తున్న.. కత్తెర పురుగు
author img

By

Published : Jul 6, 2019, 2:46 PM IST

కామారెడ్డి జిల్లాలో గతేడాది ఆశించిన స్థాయిలో మొక్కజొన్న దిగుబడి రాకపోవడంతో ధర రెట్టింపయింది. పంటకు డిమాండ్‌ పెరగడంతో రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారు. గతేడాది జిల్లా వ్యాప్తంగా సుమారు 20 వేల హెక్టారులో సాగు చేయగా ఈసారి ఇప్పటి వరకే 25 వేల హెక్టార్ల వరకు విత్తారు. ముఖ్యంగా తాడ్వాయి, సదాశివనగర్‌, గాంధారి, దోమకొండ, భిక్కనూరు, లింగంపేట, బిచ్కుంద మండలాల్లో అధికంగా సాగు చేస్తున్నారు.

ts kamareddy raitulu kattera purugu
కంటతడి పెట్టిస్తున్న.. కత్తెర పురుగు

మొలక వస్తుండగానే..
లింగంపేట మండలం మోతెలో సుమారు 400 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. పది రోజుల క్రితం విత్తిన విత్తనాలు ప్రస్తుతం మొలకెత్తుతున్నాయి. అయితే అప్పుడే మొక్కలకు కత్తెర పురుగు సోకింది. పర్మల్ల గ్రామంలో పురుగు విజృంభిస్తోంది.

ఎకరాకు రూ.పది వేల ఖర్చు
మొక్కజొన్న సాగు చేసేందుకు ఎకారానికి రూ.పది వేల వరకు ఖర్చు వచ్చినట్లు రైతులు చెబుతున్నారు. రెండు బస్తాల విత్తనాలు, డీఏపీ, నాగలి కూలి, ట్రాక్టర్‌ కిరాయి, నాట్ల కూలి.. ఇలా మొత్తం పెట్టిన పెట్టుబడి ఖర్చులు మీద పడ్డాయని వాపోతున్నారు.

లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేశా
మొక్క జొన్న పంటకు ఆరంభంలోనే కత్తెర పురుగు సోకింది. ఏఈవోను సంప్రదించి అక్కడక్కడా లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేశా. ఇప్పటి వరకు రెండు సార్లు మందులు పిచికారీ చేశానని గ్రామ రైతు తెలిపాడు.

అవగాహన కల్పించాం

వాతావరణంలో మార్పు కారణంగా కత్తెర వృద్ధి చెందుతోంది. మొక్కజొన్న పంటకు పురుగు ఇప్పుడిప్పుడే సోకుతోంది. నివారణ చర్యలు చేపట్టాలి. గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. వ్యవసాయాధికారులు సూచించిన మందులను క్రమం తప్పకుండా పిచికారీ చేయాలి. పంటలో లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా వ్యవసాయదికారి తెలిపారు.

ఇదీ చూడండి : మేక పిల్లకు పాలు ఇచ్చిన శునకం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.