ప్రభుత్వ కార్యాలయాలే తెరాస కార్యాలయంగా మారిపోయింది. గులాబీ పార్టీ సభ్యత్వ నమోదు కోసం ఏకంగా అక్కడి నాయకులు, కార్యకర్తలు మండల పరిషత్ కార్యాలయాన్నే వేదికగా మార్చేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల పరిషత్తు కార్యాలయంలో ఓ గదిలో కంప్యూటర్ ఏర్పాటు చేసి గ్రామాల వారీగా తెరాస సభ్యత్వం అంతర్జాలంలో నమోదు చేస్తున్నారు. ఈ విషయంపై జుక్కల్ ఎంపీడీవో నాగేశ్‌ను సంప్రదించగా కార్యాలయంలో సభ్యత్వం నమోదు చేసుకుంటున్న మాట వాస్తవమని ఒప్పుకున్నారు. ఎంపీపీ ఓ గదిని అడగడం వల్ల ఇచ్చామన్నారు.
ఇదీ చూడండి : దేశవ్యాప్తంగా వైద్యం బంద్- రోగుల ఇక్కట్లు