ETV Bharat / state

రామమందిర నిర్మాణానికి ముస్లిం నేత విరాళం - రామ మందిర నిర్మాణం వార్తలు

అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కులమతాలకు అతీతంగా ప్రజలు తమకు తోచిన విధంగా విరాళాలు అందిస్తున్నారు. తాజాగా మైనారిటీ సెల్​ రాష్ట్రాధ్యక్షుడు ఎంకే ముజీబోద్ధిన్​ శ్రీ రామ మందిర నిర్మాణానికి తన వంతు సాయంగా రూ. 2 లక్షల 16 వేలు అందించారు.

trs muslim leader donates to the construction of the Ram Mandir in kaamareddy
రామమందిర నిర్మాణానికి తెరాస ముస్లిం నేత విరాళం
author img

By

Published : Feb 16, 2021, 1:16 PM IST

అయోధ్య రామమందిర నిర్మాణానికి కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన తెరాస నేత, మైనారిటీ సెల్ రాష్ట్రాధ్యక్షులు ఎంకే ముజీబోద్ధిన్​ రూ. 2 లక్షల 16 వేల విరాళాన్ని అందించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో జరిగిన ఓ సమావేశంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర సభ్యులకు చెక్కును ఆయన అంజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర సభ్యులు రామ మందిర నిర్మాణానికి కులమతాలకు అతీతంగా విరాళాలు అందించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెరాస నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.