ETV Bharat / state

జాతీయ జెండా గద్దెకు పార్టీ జెండా ఆవిష్కరణ - తెలంగాణ వార్తలు

తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా మాధన్ హిప్పర్గ గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ఆ ఊరి సర్పంచ్ రాజు పటేల్ గులాబీ జెండాను ఆవిష్కరించారు. జాతీయ జెండా గద్దెకు పార్టీ జెండాను ఆవిష్కరించడమేంటని గ్రామస్థులు నిలదీశారు. మండల స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు.

trs farmation day, kamareddy district
trs farmation day, kamareddy district
author img

By

Published : Apr 27, 2021, 9:06 PM IST

గ్రామపంచాయతీ కార్యాలయం ముందు తెరాస జెండాను ఆవిష్కరించిన సంఘటన ఇది. తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మాధన్ హిప్పర్గ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండా గద్దెకు తెరాస జెండాను సర్పంచ్ రాజు పటేల్ ఆవిష్కరించారు.

పంచాయతీ కార్యాలయమా?.. పార్టీ కార్యాలయామా? అని సర్పంచ్​ను స్థానికులు నిలదీశారు. జెండా దిమ్మెతో పాటు జెండా కర్ర కూడా పంచాయతీదేనని వారు గుర్తు చేశారు. పార్టీ కోసం ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించారు. సర్పంచ్​పై చర్యలు తీసుకోవాలని మండల స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు.

సర్పంచ్ జెండా ఆవిష్కరిస్తున్న చిత్రాలను గ్రామస్థులు సోషల్ మీడియా ద్వారా వైరల్ చేశారు. ఈ విషయంపై గ్రామ సర్పంచ్ రాజు పటేల్​ను "ఈటీవీ భారత్" చరవాణిలో సంప్రదించగా.. పొరపాటు జరిగిందని సమాధానమిస్తూ దాటవేశారు. ఈ విషయంపై మండల పంచాయతీ అధికారి వెంకట నర్సయ్యను సంప్రదించగా గ్రామస్థులు తమ దృష్టికి తీసుకువచ్చారని జెండాను తొలగించామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: హైదరాబాద్‌ డిప్యూటీ మేయర్‌కు కొవిడ్​ పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.