కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో గోల్డ్ స్మిత్ వర్క్ షాప్లో రాత్రి 1 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి దుకాణం వెనుక ఉన్న తలుపును పగులగొట్టి వెండి, బంగారం వస్తువులను చోరీ చేశాడు. సుమారుగా కేజీ 800 గ్రాముల వెండి, ఒక తులం బంగారం, కొంత నగదు అపహరించాడని దుకాణ యజమాని తెలిపారు. రాత్రి దుకాణం పక్కన ఉన్నవారికి ఏదో శబ్దం రావడం వల్ల దొంగను పట్టుకునే ప్రయత్నం చేయగా.. కత్తితో బెదిరించాడని వారు వెల్లడించారు. యజమాని సంతోష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: రెచ్చిపోతున్న సైబర్గాళ్లు.. లక్షల్లో లూఠీ