ETV Bharat / state

మినీ ట్యాంక్​బండ్​ పనులను పరిశీలించిన సభాపతి - శాసన సభాపతి

కామారెడ్డి జిల్లాలోని కల్కి చెరువు వద్ద ఏర్పాటు చేస్తున్న మినీ ట్యాంక్​ బండ్​ పనులను శాసన సభాపతి పోచారం శ్రీనివాస్​ రెడ్డి పర్యవేక్షించారు.

మినీ ట్యాంక్​బండ్​ పనులను పరిశీలించిన సభాపతి
author img

By

Published : Nov 12, 2019, 8:07 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని కల్కి చెరువు వద్ద ఏర్పాటు చేస్తోన్న మినీ ట్యాంక్ బండ్ పనులను శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించారు. పట్టణ పరిసర ప్రజలకు ఆహ్లాద వాతావరణం కల్పించేందుకు ఈ మినీ ట్యాంక్​ బండ్​ను నిర్మిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పర్యటకుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అధికారులు పనుల పట్ల అలసత్వం వహించకుండా త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సభాపతి వెంట ఏఈ కిరణ్​, డీఎస్పీ దామోదర్​ రెడ్డి, పట్టణ సీఐ మహేశ్​ గౌడ్​ తదితరులు పాల్గొన్నారు.

మినీ ట్యాంక్​బండ్​ పనులను పరిశీలించిన సభాపతి

ఇవీ చూడండి: కొడవలితో మహిళ హల్‌చల్‌.. పింఛన్​ కోసం బెదిరింపు

tg_nzb_15_12_mini_tank_band_panulanu_parshilinchina_spekar_ts10122 కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం లోని కల్కి చెరువు వద్ద ఏర్పాటు చేస్తున్న మినీ ట్యాంక్ బండ్ పనులను పర్యవేక్షించిన తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బాన్స్వాడ పట్టణ సుమారు జనాభా 40 వేలమంది నివసిస్తూ ఉంటారు అలాగే ఇతర గ్రామాల నుండి ప్రతిరోజు నిత్యం పదివేల మంది వస్తుంటారు మొత్తం కలిపి 50 వేల మంది కొరకు ఆహ్లాద వాతావరణం కొరకు సాయిబాబా దేవాలయం దగ్గర ఉన్న కల్కిచెరువు వద్ద మినీ ట్యాంక్ బండ్ ను చేయడం జరుగుతుందని తెలిపారు అలాగే ట్యాంక్ బండ్ లో బోటు కొరకు 15 లక్షల రూపాయలను అలాగే బోటు యొక్క పాట్ ఫామ్ కొరకు 10 లక్షల రూపాయలు మినీ ట్యాంక్ బండ్ వద్ద 2 స్నాక్స్ సెంటర్లు ట్యాంక్బండ్ కొరకు వీక్షించే ప్రజల కొరకు 17 బెంచీలు మరియు ఒక కుర్చీ ఐదు లక్షల రూపాయలు 15 లక్షలతో 3 గోల్ చత్రి కుర్చీలనుఒక ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు మినీ ట్యాంక్ బాండ్ పై తారు రోడ్డు వేసి అలాగే ట్యాంక్బండ్ వరకు వచ్చిన పర్యాటకులు కొరుకు అన్ని సౌకర్యాలు పూర్తి చేసి బాన్సువాడ పట్టణ ప్రజలకు అందిస్తామని సభాపతి తెలిపారు అలాగే అధికారులకు పనుల పట్ల విషయంలో అలసత్వం వహించరదని ఆదేశించారు వెంటెనే పనులను వేగవంతం చేయాలని సూచనలు చేశారు ఆయన వెంట ఏఈ కిరణ్ డిఎస్పీ దామోదర్ రెడ్డి పట్టణ సిఐ మహేష్ గౌడ్ అధికారులు తదితరులు ఉన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.