కామారెడ్డి జిల్లాలోని రామేశ్వర్పల్లి తండాలో విషాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల గుగ్లోత్ బాల్సింగ్ గుడిసె దగ్ధమైంది. ఇంట్లో సమాన్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. గుడిసెలో దాచుకున్న 75 వేల నగదు, అమ్మకం కోసం ఉంచిన సుమారు 40 క్వింటాళ్ల బియ్యం, 2 తులాల బంగారం, 13 తులాల వెండి కాలిపోయాయి.
విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు పంచనామా నిర్వహించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.