ETV Bharat / state

Terrace Fish farming : టెర్రస్​పై చేపల పెంపకం.. లక్షల్లో ఆదాయం.. మీరూ ట్రై చేయండి

author img

By

Published : Aug 9, 2023, 10:19 AM IST

Updated : Aug 9, 2023, 10:39 AM IST

Terrace Fish farming in Kamareddy : పట్టణాలు కాంక్రీట్​ జనారణ్యాలుగా మారిపోతున్న ప్రస్తుత కాలంలో మిద్దె తోటల వైపు నగరాలలో ఉండే ప్రజలు ఆకర్షితులవడం మనం చూస్తున్నాం. అదే తరహాలో ఈ కామారెడ్డి జిల్లా మహిళామణులు నూతన సంప్రదాయానికి నాంది పలికారు. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలనీ, పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వాలన్న తపనతో 'మిద్దె చేపల పెంపకం' అనే నయా సాగుకు ఆ తల్లులు తెరలేపారు. ఇంతకీ ఈ 'మిద్దె చేపల పెంపకం' ఎలా ఉంటుంది.. ఎంత మొత్తంలో ఖర్చవుతుందనేది వారి మాటల్లోనే ఇప్పుడు చూద్దాం..

Terrace Fish farming
Fish

Terrace Fish farming in Kamareddy : రోజురోజుకు పెరుగుతున్న జనాభాతో ఎక్కడ చూసినా పంటలు పండించే పొలాలు తగ్గిపోతున్నాయి. పండించిన పంటలు రసాయనాలతో సాగు చేస్తుండడంతో ప్రజలు ఇటీవల కాలంలో మిద్దె తోటల వైపు(Terrace Farming) మొగ్గుచూపుతున్నారు. కాబట్టి ఈ మిద్దె తోటల పెంపకం గురించి మీరు వినే ఉంటారు.. కానీ ఈ 'మిద్దె చేపల పెంపకం' గురించి విన్నారా? తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఉంటున్న కొందరు మహిళామణులు కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలనీ, పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వాలనే తపనతో ఈ తరహా కొత్త సంప్రదాయానికి తెరలేపారు. వారి ఆలోచనే మిద్దె, చేనుల్లో చేపల పెంపకానికి నాంది పలికింది. ఇంతకీ వారికీ ఆ ఆలోచన ఎలా వచ్చింది.. ఈ పెంపకం కార్యాచరణ ఏంటో వాళ్ల మాటల్లోనే తెలుసుకుందాం..

Rooftop Fish Farming in Telangana : సాధారణంగా మనందరికీ చేపల పెంపకం అంటే గుర్తొచ్చేవి... చెరువులే. కానీ కామారెడ్డిజిల్లా స్వశక్తి సంఘాల మహిళలు ‘ముత్యాలనే పెరట్లో పెంచుతున్నప్పుడు(Pearl Farming Telangana).. చేపల్ని ఎందుకు పెంచలేం?’ అనే ఆలోచన చేశారు. మిద్దెలు, పెరళ్లలో చేపలు పెంచుతూ తోటి మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఈ మహిళామణులు. స్త్రీనిధి రుణాలతో మీనాల పెంపకం చేపడుతూ.. తమ ఇంట మత్స్యసిరులు సృష్టిస్తున్నారు. చేపల పెంపకం గురించి మొదట్లో అధికారులకు చెప్పినప్పుడు అయ్యేపని కాదనుకున్నారు. సాధ్యాసాధ్యాలు వివరించి, రుణం ఇస్తామన్నా.. బెడిసి కొడితే పరిస్థితి ఏంటి? అనేదీ ఆలోచించారు. ఇలా అనేక అనుమానాల మధ్య మొదలైన వీరి 'మిద్దె చేపలసాగు' ప్రయాణం ఇప్పుడు విజయవంతంగా నడుస్తోంది.

Roof Garden: మిద్దెతోట సాగుపై పెరుగుతున్న ఆసక్తి.. శిక్షణ ఇస్తున్న ఉద్యానశాఖ

'గ్రూప్‌ సమావేశంలో చేలల్లో చేపల సాగు గురించి చెప్పినప్పుడు ఆసక్తిగా అనిపించింది. నేనూ ప్రయత్నించాలనుకున్నా. అందరూ చేలల్లో షెడ్లు వేసుకుంటున్నారు. మాకేమో పొలం లేదు. వేరే దారుల గురించి వెతికితే.. చిన్న చిన్న ట్యాంకుల్లో చేపల్ని పెంచే బయోఫ్లాక్‌ విధానం గురించి తెలిసింది. అధికారులకు చెబితే ఆలోచన బాగుందన్నారు. కానీ సంరక్షణ సవాల్‌తో కూడుకున్న విషయం అన్నారు. నీటి వినియోగం, మార్పిడి అంశాలపై ప్రత్యేక తరగతులు చెప్పారు. పర్యవేక్షణ కాస్త కష్టంగానే ఉన్నా పట్టుదలగా ముందుకు వెళ్తున్నా.' - చందాపురం రేణుక, మిద్దె చేపల పెంపకందారు

యూట్యూబ్‌ ఇచ్చిన ఆలోచన : 'ఆసక్తి ఉన్నా అనువైన స్థలం లేదు. యూట్యూబ్లో మార్గాలు వెతికా. అప్పుడే ముత్యాలసాగు వీడియో కనిపించింది. ఆ పద్ధతిలో చేపలు పెంచితే? అన్న ఆలోచన వచ్చింది. రేణుకా ఇదే బాటలో వెళ్తున్నట్టు తెలుసుకున్నా. మిద్దెపై ట్యాంకుల నిర్మాణం చేయించా. ఇదేం కొత్త పద్ధతి కాదు. విదేశాల్లో అమలులో ఉన్నదే. అధికారులు ఎప్పటికప్పుడు మా సందేహాలను నివృత్తి చేస్తూనే ఉన్నారు. చుట్టుపక్కల వారంతా మా ఆలోచన భేష్‌ అంటూ ప్రశంసించారు' మిద్దె చేపల పెంపకందారు నీల రాజ్యలక్ష్మి తెలిపారు.

పెట్టుబడి రూ.40 వేలు.. లాభం రూ.2 లక్షలు.. ఇదీ ఆ రైతుల విజయగాథ..

'మిద్దె చేపల పెంపకం జరుగుతున్న గ్రామాలని చూశాను. చేపలు పట్టడమే మా జీవనాధారం. పడితేనే తిండి. లేదంటే పస్తులే. ప్రయోగాత్మకంగా అనిపించి, ప్రయత్నిస్తే బాగుండు అనిపించింది. మావారూ ఒప్పుకొన్నారు. స్త్రీనిధి కింద రుణం మంజూరైంది. షెడ్‌ల నిర్మాణానికి కొంత చేతిడబ్బును పెట్టుకున్నా. నెల రోజులు శ్రమించి ట్యాంకులు కట్టాం. దాదాపు రూ.16 లక్షలు ఖర్చయింది. అనుకున్నదాని కంటే మెరుగ్గానే చేపపిల్లల బరువు పెరిగింది. విక్రయ బాధ్యతలు కూడా విత్తన సరఫరా చేసిన సంస్థే తీసుకుంది. మొదట్లో భయంగా ప్రారంభించినా ఇప్పుడిప్పుడే కాస్త ధైర్యం వస్తుంది' - శ్రావణి, చేపల పెంపకందారు, గాంధారి

చిన్నపిల్లల్ని పెంచినట్టే వీటిని చూసుకుంటున్నాం : 'మొదట్లో తెచ్చిన చేపలన్నీ చనిపోయాయి. ఎందుకు మీనాలు మరణిస్తున్నాయని ఆరా తీస్తే వాతావరణానికి సర్దుబాటు కావడానికి సమయం పడుతుందన్నారు. భయం వేసింది. కానీ సంస్థ ఇచ్చిన ధైర్యంతో మళ్లీ విత్తన చేపలు ట్యాంకుల్లోకి వదిలాం. ఈసారి బాగా పెరిగాయి. మూడు గంటలకోసారి దానా వేస్తుంటా. రోజులో 5 సార్లు తప్పనిసరిగా వెళ్లిచూస్తుంటా. పంటని, చిన్నపిల్లల్ని పెంచినట్టే అపురూపంగా వీటిని కూడా చూసుకుంటున్నాం' అని మరో చేపల పెంపకందారు మైలి శ్రీలత పేర్కొన్నారు.

Young Farmer : ఉద్యోగం వదిలి.. 'పూల'బాటలో యువరైతు

లక్ష పెట్టారు.. రెండున్నర లక్షల వరకూ గడించారు : మొదట కామారెడ్డి జిల్లాలోని లింగంపేటలో తర్వాత దోమకొండ, గాంధారి, సదాశివనగర్‌, రాజంపేట, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలకు చెందిన 53 మంది మహిళలు గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో 'మిద్దె చేపల పెంపకం' మొదలుపెట్టారు. మిగతా గ్రామాల వారూ ఇప్పుడు దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. వీరిలో ముందుగా వేసిన ఆరుగురు మహిళలకు మంచి ఉత్పత్తి, ఆదాయం లభించాయి. రూ.30కి కొన్న చేపపిల్లలు కేజీ రూ.150 వరకూ అమ్ముడయ్యాయి. చేపరకం బట్టి మంచి ధర పలుకుతోంది. రూ.లక్ష పెట్టుబడి పెడితే రెండు, రెండున్నర లక్షల వరకూ ఆదాయం వచ్చింది.

Sake Bharati PhD story: పట్టుదలే ఆయుధం.. పీహెచ్​డీ పట్టా సాధించిన కూలీ

Pochampally silk sarees : ఉద్యోగం వదలి.. చేనేత వైపు కదిలాడు.. ఎందరికో ఆదర్శంగా నిలిచాడు

Last Updated : Aug 9, 2023, 10:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.