కామారెడ్డి జిల్లాలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏకాదశి సందర్భంగా ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ఆలయాల వద్ద భక్తులు క్యూ కట్టారు.
జిల్లా కేంద్రంలో పురాతన వేణుగోపాల స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. కిలోమీటర్ మేర బారులు తీరారు.
ఇవీచూడండి: రాష్ట్రంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు