ETV Bharat / state

'కష్టపడి పనిచేసే వారిని భూమాత ఆశీర్వదిస్తుంది'

కష్టపడి పనిచేసే వారిని భూమాత ఆశీర్వదిస్తుందని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్​రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా మైలారంలో బీర్కూర్​ వ్యవసాయ మార్కెట్​ కమిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

telangana state assembly speaker pocharam srinivas reddy laid foundation for agriculture market committee building at mylaram  in kamareddy district
'కష్టపడి పనిచేసే వారిని భూమాత ఆశీర్వదిస్తుంది'
author img

By

Published : Jan 12, 2020, 5:46 PM IST

కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామంలో రూ. 55 లక్షలతో నూతనంగా నిర్మించనున్న బీర్కూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నిర్మాణానికి రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు.

'కష్టపడి పనిచేసే వారిని భూమాత ఆశీర్వదిస్తుంది'

ఈ వ్యవసాయ మార్కెట్​లో 5వేల మెట్రిక్​ టన్నుల సామర్థ్యం గల గోడౌన్​ను నిర్మిస్తామని పోచారం తెలిపారు. కష్టపడి పనిచేసే వారిని భూమాత ఆశీర్వదిస్తుందన్నారు. రాష్ట్రంలో వరి ధాన్యం అత్యధికంగా బాన్సువాడ నుంచే దిగుబడి అవుతుందని వెల్లడించారు.

రాష్ట్ర రైతులకు ఉచిత విద్యుత్​ అందించడానికి ప్రభుత్వం ఏటా రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ యాదిరెడ్డి, తహసీల్దార్ గంగాధర్, ఎంపీపీ విట్టల్ పాల్గొన్నారు.

TG_NZB_01_12_MARKET_SUBYARD_BHOOMI_POOJA_CHESINA_SPEKAR_AV_TS10122 జనవరి 12, 20220 కామారెడ్డి జిల్లా. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ హు మండలం మైలారం గ్రామంలో రూ. 55 లక్షలతో నూతనంగా నిర్మించనున్న బీర్కూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సబ్‌యార్డు ప్రహరీ గోడ మరియు గేట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి గారు ఈసందర్భంగా రైతులను ఉద్దేశించి స్పీకర్ పోచారం గారు మాట్లాడుతూ... నసరుల్లాబాద్ నూతన మండలంగా ఏర్పాటు కావడంతో పాటు, వ్యవసాయ పరంగా ఇక్కడ రైతులు మంచి పంటలు పండిస్తారు కాబట్టి నూతన వ్యవసాయ మార్కెట్ అవసరం ఉన్నది. రైతులకు అవసరమైన మౌళిక సదుపాయాలు పెంచుకోవాలి. ఈ వ్యవసాయ మార్కెట్ లో 5000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కల గౌడాన్‌ను నిర్మిస్తాం. కష్టపడి పనిచేసిన వారిని భూమి తల్లి ఆశీర్వధిస్తుంది. రాష్ట్రంలో వరి ధాన్యం దిగుబడులు అత్యధికంగా సాధించే రైతులు బాన్సువాడ నియోజకవర్గ రైతులు. దేశంలో వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చెసే ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇందుకు ఏటా రూ. 5000 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ యాదిరెడ్డి తాసిల్దార్ గంగాధర్ ఎంపీపీ పల్త్యవిట్టల్ రైతులు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.