కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ పర్యటించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులను సభాపతి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులను తీసుకుని స్వయంగా ఎలక్ట్రిక్ బగ్గీ కార్ నడుపుతూ పట్టణంలో కలియతిరిగారు.
ఈ పర్యటనలో భాగంగా బాన్సువాడ పట్టణంలో నూతనంగా నిర్మించబోయే మున్సిపల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం సేకరించిన స్థలాన్ని సభాపతి పరిశీలించారు. అనంతరం బాన్సువాడ నూతన డీఆర్ఓ కార్యాలయం కోసం ఏర్పాటు చేసిన స్థలాన్ని అధికారులతో కలిసి సందర్శించారు.
ఇదీ చదవండి: పోడు భూములపై అటవీశాఖ అధికారుల దౌర్జన్యం.. లాక్కొవద్దని గిరిజనుల ఆవేదన