ETV Bharat / state

'మే నెల నుంచైనా పూర్తి వేతనాలు చెల్లించాలి' - lock down effect

రాష్ట్ర ప్రభుత్వం మే నెల నుంచైనా ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించాలని జేఏసీ సభ్యులు డిమాండ్​ చేశారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని పెట్​ సంగ్యం శివాలయంలో కుటుంబసమేతంగా ఎస్టీయూ మెదక్​ జిల్లా అధ్యక్షుడు నిరసన వ్యక్తం చేశారు.

stu leaders protest with family for full salary from may month
'మే నెల నుంచైనా పూర్తి వేతనాలు చెల్లించాలి'
author img

By

Published : May 23, 2020, 7:34 PM IST

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని పెట్ సంగ్యం శివాలయంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు ప్రణీత్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి నిరసన వ్యక్తంచేశారు. లాక్​డౌన్​ కొనసాగుతున్న కష్ట కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్ల జీతభత్యాల్లో 50 శాతం కోత విధించడం బాధాకరమని ప్రణీత్​ కుమార్​ తెలిపారు.

ప్రభుత్వం మే నెల నుంచైనా ప్రతి ఉద్యోగికి పూర్తి వేతనం అందించాలని జేఏసీ పక్షాన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు సిద్ధిరాములు, మధుసూదన్, మల్లికార్జున్, పెన్షనర్ సంగయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: బిడ్డ పెళ్లి లొల్లి.. తెగిన తల్లి తాళి!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.