కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 66వ అఖిల భారత సహకార సంఘాల వారోత్సవాల ముగింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో సహకార సంఘాల పాత్ర అతి ముఖ్యమైనది సభాపతి పేర్కొన్నారు. ఈ సహకార సంఘాలు వ్యవసాయదారులకు రుణాలను, సబ్సిడీపై ఎరువులను అందజేస్తున్నాయని తెలిపారు.
రైతులు సహకార సంఘాల నుంచి రుణం తీసుకునే స్థాయి నుంచి బ్యాంకుల్లో పొదుపు చేసే స్థాయికి ఎదగాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి రమ్య, ఆర్డీవో రాజేశ్వర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంజిరెడ్డి, సొసైటీ ఛైర్మన్ యేరువల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: సీఎం గారూ ఆర్టీసీ కార్మికులను చేర్చుకోండి: పవన్ కల్యాణ్