ETV Bharat / state

బాన్సువాడలో సభాపతి పోచారం పర్యటన - బాన్సువాడలో పర్యటించిన పోచారం వార్తలు

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పర్యటించారు. నూతనంగా విస్తరించనున్న బాన్సువాడ నుంచి తాడ్కోల్​ వైపు వెళ్లే రహదారిని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించారు.

speaker Pocharam srinivasareddy toured in Banswada in kamareddy
బాన్సువాడలో సభాపతి పోచారం పర్యటన
author img

By

Published : Jun 7, 2020, 4:29 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ పరిధిలో నూతనంగా విస్తరించనున్న బాన్సువాడ నుంచి తాడ్కోల్ వైపు వెళ్లే రహదారిని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు.

బాన్సువాడ పట్టణం మున్సిపాలిటీగా అవతరించాక రోడ్లను విస్తరించడం, నూతనంగా నిర్మించడం వంటివి పెద్ద ఎత్తున జరుగుతున్నాయని సభాపతి పేర్కొన్నారు. ఇప్పటికే ప్రధాన రహదారి విస్తరణ పూర్తై, 4 వరుసలతో రాష్ట్రంలోనే ఒక మోడల్​గా ఉందన్నారు. పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే రహదారిపై జుక్కల్, నారాయణఖేడ్ నియోజకవర్గాలతో పాటు మహారాష్ట్ర వాహనాలు కూడా తిరుగుతున్నాయన్న ఆయన.. వాహనాల రద్దీ దృష్ట్యా తాడ్కోల్ చౌరస్తా నుంచి సుమారు ఒక కిలోమీటరు వరకు ప్రస్తుతం ఉన్న రహదారిని ఫోర్ లైన్​గా విస్తరిస్తామని చెప్పారు. సెంట్రల్ డివైడ్, ఇరువైపులా డ్రైనేజీ, ఫుట్​పాత్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఈ పనుల కోసం పురపాలక శాఖ ద్వారా రూ.90 లక్షలు, ఆర్​ అండ్​ బీ శాఖ ద్వారా రూ. 2 కోట్లు మంజూరు చేశారన్నారు. పూర్తి స్థాయి సర్వే అనంతరం అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేయించి.. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఈ రోడ్డును అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

కార్యక్రమంలో ఆర్​డీవో రాజేశ్వర్, మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, డీఎస్పీ దామోదర్​రెడ్డి, సొసైటీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, జిల్లా రైతు సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాన్సువాడలో సభాపతి పోచారం పర్యటన

ఇదీచూడండి: మీరు కొట్టుకోండి.. మేం కొట్టేస్తాం..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.