గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. భూ తగాదాలు పరిష్కరించి వాళ్ల భూమి వారికి కేటాయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సేవాలాల్ మహరాజ్ 282వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
సెలువుగా..
తెలంగాణ ఏర్పడిన తరువాత సేవలాల్ జయంతి వేడుకలు అధికారికంగా ప్రతి నియోజకవర్గంలో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జయంతిని సెలువు దినంగా ప్రకటించేలా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఉత్సవాల్లో గిరిజన కళాకారులతో, సినీ ఆర్టిస్ట్ చమ్మక్ చంద్ర, పవన్ అడిపాడారు.
కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ ఛైర్మన్ శోభరాజు డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఆర్డీఓ రాజ గౌడ్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'పాత వస్త్రాలు దానం చేసి మరొకరి గౌరవం కాపాడుదాం'