ETV Bharat / state

పరిసరాలను శుభ్రం చేసిన శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

వర్షాకాలంలో విస్తరించే సీజనల్​ వ్యాధుల నివారణకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ చేపట్టిన ప్రతి ఆదివారం.. పది గంటలకు.. పది నిమిషాలు అనే కార్యక్రమంలో భాగంగా శాసనసభ స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డి పాల్గొన్నారు. బాన్సువాడ పట్టణంలో వర్షపు నిల్వ నీటిని ఆయన స్వయంగా తొలగించారు.

Speaker Pocharam Srinivas Reddy Tour In Banswada
నిల్వ నీరు తొలగించిన స్పీకర్ పోచారం
author img

By

Published : Jun 14, 2020, 7:31 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో శాసనసభ స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డి పర్యటించారు. వర్షాకాలంలో వ్యాపించే సీజనల్​ వ్యాధుల నివారణకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ చేపట్టిన ప్రతి ఆదివారం పది గంటలకు.. పది నిమిషాలు కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ పట్టణంలో పరిసరాలు శుభ్రం చేశారు.

పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ఉన్న రహదారిపై నిల్వ ఉన్న వర్షపు నీటిని ఆయన తొలగించారు. ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం 10 గంటలకు.. 10 నిమిషాలు కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను శుభ్రపరుచుకోవాలని సూచించారు. ఇలా చేయడం వల్ల సీజనల్ వ్యాధి నిర్మూలనకు కృషి చేసినట్లవుతామని అన్నారు. కార్యక్రమంలో స్పీకర్​తో పాటు.. ఎంపీ బీబీ పాటిల్, ఉమ్మడి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, సొసైటీ ఛైర్మన్ కృష్ణారెడ్డి, జడ్పీ ఛైర్మన్ శోభరాజు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: అకాల వర్షాలతో రైతన్న కష్టం నేలపాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.