ETV Bharat / state

రైతు వేదికల నిర్మాణంలో రైతులు భాగస్వామ్యం కావాలి : పోచారం

రైతు వేదికల నిర్మాణంలో రైతులు భాగస్వాములు కావాలని తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్​ రెడ్డి పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో రైతు వేదికలు, కల్లాల నిర్మాణంపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు.

Speaker Pocharam Srinivas Reddy Meeting With Formers
రైతు వేదికల నిర్మాణంలో రైతులు భాగస్వామ్యం కావాలి : పోచారం
author img

By

Published : Jun 29, 2020, 11:04 PM IST

కామారెడ్డి​ జిల్లా బాన్సువాడలో నిర్వహించిన రైతు వేదికలు, కల్లాల నిర్మాణ అవగాహన సదస్సులో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్​ రెడ్డి పాల్గొన్నారు. రైతులను అప్పుల నుంచి బయట పడేసేందుకు కేసీఆర్​ కంకణం కట్టుకున్నారని ఆయన తెలిపారు. రూ.22 లక్షల వ్యయంతో నిర్మించే రైతు వేదికలు గ్రామాల వారిగా రైతులు కూర్చొని మాట్లాడుకోవడానికి, సమావేశాలు నిర్వహించుకోడానికి ఉపయోగపడుతాయని అన్నారు.

ప్రపంచంలోనే రైతులకు పెట్టుబడి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్ ,ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అంజి రెడ్డి, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు పంచాయతీరాజ్ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: హైదరాబాద్​లో మరోసారి లాక్​డౌన్​..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.