రాష్ట్రంలో అందరికీ సొంతిళ్లు ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టారని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ తండాలో కొత్తగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు అందించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో రూ.5 లక్షల 4 వేల రూపాయలతో ఇళ్లు నిర్మిస్తున్నట్లు సభాపతి పేర్కొన్నారు. ఇలాంటి పథకం ఏ రాష్ట్రం కూడా అమలు చేయడం లేదని తెలిపారు. ప్రతి నిరుపేద సొంతింటి కలను నెరవేర్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని పోచారం వెల్లడించారు.