కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల మధ్య స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. విద్యార్థులందరూ సభాపతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఆ తర్వాత నులిపురుగుల నివారణ మందును పోచారం పంపిణీ చేశారు. నులిపురుగులు అపరిశుభ్రత వలన వస్తుందని స్పీకర్ విద్యార్థులకు తెలియజేశారు. చేతుల్లో ఉండే మట్టి ఆహారంలో కవడం వల్ల కడుపులో నులిపురుగులు పెరిగి నొప్పి వస్తోందని చెప్పారు. పురుగుల నివారణ మందు ఒక సంవత్సరం నుంచి 19 సంవత్సరాల వయసు గల బాలబాలికలు తీసుకోవచ్చని తెలిపారు. ఆల్బెండజోల్ మాత్రల ద్వారా నులిపురుగులను నివారించవచ్చని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:మహంకాళి ఆలయానికి రూ.10 కోట్లు ఇవ్వండి: అక్బరుద్దీన్